శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అమెరికా అవధానాలు - ప్రసంగాలు (అక్టోబర్ 29 - డిశంబర్ 8, 2019) 

ఒర్లాండో - ఫ్లోరిడా: (తేదీ. 2-3 నవంబరు, 2019) వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు బృహత్ ఒర్లాండో తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు మా దుర్గా బాబా దేవాలయం, అపోప్కా వి. రోడ్, ఒర్లాండో.


 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఓర్లాండో మహానగర తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది.
ప్రారంభ సభ: ప్రధాన సమన్వయ కర్త మధు చెరుకూరి గారి నిర్వహణలో జరిగిన ప్రారంభసభలో భారతదేశం నుంచి మొదటి సారిగా అమెరికా ఆహ్వానిత అతిధులుగా విచ్చేసిన ‘శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రారంభోన్యాసంతో రెండ్రోజుల సభాకార్యక్రమాలు శుభారంభమయ్యాయి.

చమత్కారవంతమైన విఘ్నేశ్వర, సరస్వతీ ప్రార్థనలతో... అవధాని పార్వతీశ్వర శర్మ పద్యాశీస్సులందించారు.

రెండో రోజు ప్రసంగ వేదికలో రెండు గంటలపాటు అవధానం - చమత్కారాలు అన్న అంశం మీద శతావధాని పార్వతీశ్వర శర్మ ప్రత్యేకోపన్యాసం చేసారు. అవధాన విద్యా నేపధ్యం వివరించి పూర్వావధానుల, స్వీయ ఉదాహరణలతో సభలోని వారందరినీ తన వాక్చమత్కృతితో  కట్టిపడేశారు.
సదస్సుకి వచ్చిన సుమారు 75 మంది ప్రతినిధులు, భాషాభిమానులు ఆయా ప్రసంగ వేదికలలో వక్తలు ఎంతో ఉత్సాహంతో సాహిత్య ప్రసంగాలతో సదస్సు విజయవంతమైంది.


ఛాయా చిత్రాలు

 

 

వీడియోలు

 

వెనుక పేజీ (అమెరికా యాత్ర)