పేరొందిన అవధానాలు

  • విశాఖ పౌరగ్రంథాలయంలో - విశాఖసాహితి ఆధ్వర్యవంలో గురుపూర్ణిమనాడు 2005వ సంవత్సరంలో ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకత్వలో, ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతమైంది.

  • "సీతకున్ జనియించె కృష్ణుడు చేతి శూలముతో మహిన్" అన్న సమస్యను క్రమాలంకారంలో పూరించిన విధానం, అలాగే అన్న, కన్న, విన్న, తిన్న, అనే దత్తపదిని భాగవతార్థంలో పూరించిన విధానం పండితుల ప్రశంసలను కురిపించాయి.

  • డా. వి.యస్‌. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో డా. మీగడ రామలింగ స్వామిగారి సంచాలకత్వంలో మూడవ అవధానంలో ఇచ్చిన సమస్య "ముండవు కావునన్ సుమసమూహము దెచ్చితి నీకు కాన్కగన్". ఈ సమస్యను పూరించిన విధానం ప్రేక్షకుల మన్ననలందింది.

  • విజయనగరం, మహారాజా సంగీత కళాశాల - విజయభావన సాహిత్యసంస్థ నిర్వహణలో ఉగాది సందర్భంగా చేసిన అవధానంలో దత్తపది అమ్మ, కొమ్మ, నిమ్మ, బొమ్మ. భాగవతార్థంలో అందించిన పూరణ విశేషంగా సబ్యుల్ని ఆకట్టుకుంది. ఇది ఏడవ అవధానం

  • హైదరాబాదు, శంకరమఠం - పదసాహిత్యపరిషత్‌ నిర్వహణలో - ఆచార్య మంగళగిరి ప్రమీలాదేవి సంచాలకత్వంలో చేసిన ఎనిమిదవ అవధానంలో శ్రీపాక ఏకాంబరాచార్యులు నిషిధ్ధాక్షరి అంశాన్ని నిర్వహించారు. ఆదిశంకరుల గురించి చెప్పిన ఈ పద్యం అందర్నీ అలరించింది.

  • కొవ్వూరు- బాలాత్రిపుర సుందరి ఆలయప్రాంగణం. "అష్టావధాని" "పండిత" నేమాని రామజోగి సన్యాసిరావు సారధ్యంలో చేసిన అవధానం తలమానికమైంది. పండితవర్గం అందించిన ప్రతి అంశం, పూరణ చిరస్థాయిగా నిలిచేవే.

  • డా. వి.యస్‌. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ద్యుత్సవాలు సందర్భంగా చేసిన అవధానంలో అన్ని అంశాలు దాదాపు కృష్ణదేవరాయల ఆస్థానపరంగానే వచ్చాయి. ఇచ్చిన అంశాల్లోని క్లిష్ట్నతను సరళమైన పూరణలతో అవధాని రమణీయంగా ఎదుర్కొన్నారు.

  • విశాఖ జిల్లాపరిషత్‌ సమావేశమందిరం - గిడుగు వెంకటరామ్మూర్తి జయంత్యుత్సవం - తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా చేసిన అవధానం విశాఖ జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ప్రభుత్వనిర్వహణలో సాగిన తొలి అవధానమిది.

  • పల్లెపాలెం - ఆంధ్ర కుటీరం, యానాం దరి - పిఠాపురాస్థానకవి శ్రీఓలేటి వేంకటరామశాస్త్రి జయంత్యుత్సవం సందర్భంగా మధునాపంతుల సత్యనారయణ గారి ఆంధ్ర కుటీరంలో పండితుల మధ్య ఈ అవధానం జరిగింది.

  • 20వ అవధానం కలవరాయి అగ్రహారం - గణపతిముని స్మారక మందిరం, బొబ్బిలి, విజయనగరం జిల్లా - గణపతిముని 75వ ఆరాధనోత్సవం సందర్భంగా .