సమస్యా పూరణ పద్యాలు

తేది: 22-05-2007.


శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మ వారి ఆలయం, కొవ్వూరు,పశ్చిమ గోదావరి.

 

సమస్య:
మేమాసమునందు శైత్యమేర్పడుప్రజకున్

 

పూరణ: ఏమాభానుని జృంభణ
మేమని!జనులెల్ల జేరిరిష్టము తోడన్
క్షేమంబని ‘ఊటీ‘; కను
మేమాసమునందు శైత్యమేర్పడుప్రజకున్

 

దత్తపది : అరుణ, కరుణ, చరణ, డరన - మక్కామసీదులో బాంబు పేలుడు.

నీచ రణంబులవేలా?
ఆచరణంగరుణ గూర్చి యారాథింపన్
యోచించి వేడర నరుల
గాచుమయా యరుణమేల కాల్పులవేలా?

 

వర్ణన : బాలా త్రిపుర సుందరీ స్తోత్రం

 

పూరణ:
తల్లీయేవిధినీదు రూపమహిమన్ ధ్యానింతు నానెమ్మదిన్
వల్లౌనొక్కొ? కృపానిధీ!త్రినయనీ!వర్ణింప నా సాధ్యమే!!
కల్లల్చెప్పగ జాలనమ్మ జననీ !కాత్యాయనీ! భైరవీ!!
తల్లీబాల! పసన్నమూర్తి! త్రిపురా! ధ్యాస న్నిను న్నిల్పెదన్!!!

 

నిషిద్ధాక్షరి: ఎండిన గోదావరిని అందంగా......

 

పూరణ: ఆహా! నీకై తీసెన్
మోహంబున మాదు మాస్య మూలంబగుచున్!
వాహిని గౌతమి దీర్పన్
దాహంబును సూర్యదేవ! తానెండెగదా!!

 

న్యస్తాక్షరి: గ్రీష్మర్తు వర్ణన -

1వ పా|| 1వ అక్షరము - క, 2వ పా|| 3వ అక్షరము - చ,
3వ పా|| 6 వ అక్షరము - ట, 4వ పా|| 8వ అక్షరము - త,

 

పూరణ:

Oలవరమందగా జనత, గాల్పుచునుండగా నెండలీ ధరన్
తలVక తప్పదా శశిని, తానిడు వెన్నెల శీతలమ్ములన్!
అలయెటు మంటపోవునని,యాత్రముతోడుత నుండిరేజనుల్!
సలసల క్రాగి భూhలము సాటిగ నిల్చెను సూర్యమూర్తికిన్!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!