సమస్యా పూరణ పద్యాలు

తేది: 12-11-2006.


భారతీ కళ్యాణ మండపం, నాయుడుతోట, విశాఖ. (శ్రీ తాతా వేంకట లక్ష్మీ నర్సింగరావు గారి పదవీ విరమణ)

 

సమస్య : చందమామిదె కాననయ్యెడు సౌరుమీర కుహూనిశిన్

 

పూరణ:
సుందరాంగు డమాసరాతిరి జూడముచ్చట గొల్పుచున్
చందమామను పోలి పుట్టెను శర్మనామ వధానియున్!
బందుగు ల్కని మెచ్చుచుండిరి, భావమందున నీవిధిన్
చందమామిదె! కాననయ్యెడు సౌరుమీర కుహూనిశిన్!!

 

దత్తపది: లలిత, జనిత, వనిత, ఘనత. (అమ్మవారి వర్ణన)


పూరణ: జనతగాచెడు తల్లివి జగమునందు
నని తనువుగ నుండిన అమ్మ! నీకు
లలిత పదముల తోడ మాలలనుగట్టి
Tనhనొందంగనర్చింతు మనమునిండ!

 

వర్ణన: కార్తీక దామోదరుని గూర్చి


పూరణ: దీపంబుల నీకిడుదురు
కాపాడుము స్వామియనుచు కార్తీకమునన్!
ఆపై నైశ్వర్యమునకు
తాపత్రయ పడుచు జనులు దామోదరుడా!!

 

నిషిద్ధాక్షరి : నేటి విద్యావిధానము గురించి


పూరణ : శ్రీయుతమై మనమెల్లన్
యీయీ భూమింగనంగ నెట్లున్నదియో!
గాయము నొందియు, కరవై
పోయెనుగద నేటి విద్య! పుడమిం గలిలో!!

 

న్యస్తాక్షరి : శారదాంబ స్తోత్రం.

1వ పా ॓5వ అక్షరం- భా 2వ పా ॓8వ అక్షరం - ర
3వ పా ॓12వ అక్షరం - త 4వ పా ॓13వ అక్షరం - ము

 

పూరణ:

తలచెద భారతీ! తొలుత ధైర్యముగల్గగ నండదండకై!
నిలిపెద పద్యవారధిని నీ శుభ పాదము నన్ను బ్రోవగా!!
మలచెదనెల్ల విద్యలకు మాత నీవని హృద్వనమ్మునన్!
నిలువుము నా గళమ్మునను నిత్యmంచెద శారదాంబరో!!

 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!