సమస్యా పూరణ పద్యాలు

తేది:29-07-2011.


కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చాతుర్మాస్య దీక్ష సందర్భంగా శ్రీలలితాపీఠం, విశాఖపట్టణము.

 

సమస్య :
పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వవేళలన్

 

పూరణ :
ఉల్లమునందు నొక్క తరియూహను చేయగ నంచితంబుగా
చెల్లదటన్న మాటలిక చెల్లవయా! మన యంత్ర రాజ్యమం
దల్లియు జూపిరే గణన యంత్రమునందున, కాన నెత్తరిన్
పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వవేళలన్

 

దత్తపది: కల్మాడి, రాజా, కనిమొళి, దయానిధి - భారతార్థం.

 

పూరణ :
కల్మాfంగను చెల్మిదక్క వలెనే కాంచన్ కురుక్ష్మాపతీ!
తాల్మిన్ గ్రామములైదు నీయమనవే! ధర్మంపురాజాజ్ఞచే
వల్మీకోద్భవుయోగి బాట విడిరావా కన్ములీలన్ వడిన్
మేల్మేలౌను దయానిధిm! గుణవరున్ మెప్పింప వే ధర్మజున్

 

వర్ణన : కుర్తాళం పీఠాధిపతి చాతుర్మాస్య వ్రతం - విశాఖ ప్రజలకు వరం.

 

దేవీభాగవత ప్రశస్త కథనోద్దీప్తంబులౌ శక్తి స
ద్భావంబుల్ నిజ హృద్వనాన సతముం బాటించుచున్ ! యోగిగా
గావం జొచ్చిన దేవతాత్ముడనగా కన్పించు భక్తాళికిన్;
యావన్మాన్యులు కొల్చుచుంద్రు మదిలో నత్యంత భక్త్యున్నతిన్!!

 

 

నిషిధ్ధాక్షరి : ‘మ’ అనే అక్షరం రాకుండా తల్లి పాదాల వర్ణన.


అంబికపదాలు కొల్వగ
సాంబునికిన్ దక్కునొక్కొ? సంభావింపన్!
అంబుజ చరణ ద్వంద్వ శు
భంబులకై తత్త్వసిద్ధి భావనబొందన్

 

న్యస్తాక్షరి :

అనంతపద్మనాభునివరించిన లక్ష్మీవర్ణన -ఉత్పలమాల

1వ పాదం 16వ అక్షరం - శ్రీ, 2వ పాదం 8వ అక్షరం- వ,
3వ పాదం 11వ అక్షరం - ల్ల, 4వ పాదం 9వ అక్షరం- భ.

 

నేలను దాచినట్టి కననేరని పొల్పగు శ్రీలరాశి త
న్నేలిన విష్ణుమూర్తి వనజేక్షణు డీగతి నందజేసెనో
జాలముచేయబోకనది సల్లలితంబుగ భక్తి మార్గమున్
పాలుర పాలుగాక శుభ భావముతోడ వ్యయింప మాన్యమౌ!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!