సమస్యా పూరణ పద్యాలు

తేది:15-11-2010.


పీఠికాపుర ఆస్థాన కవి - శతావధాని శ్రీ ఓలేటి వెంకటరామశాస్త్రి గారి జయంతి ఆంధ్రీకుటీరం , పల్లెపాలెం.

 

సమస్య :
ముచ్చటగొల్పు ముద్దియకు మూతిని మీసముమొల్చెవింతగా

 

పూరణ :

కచ్చితమైన నిర్ణయము గైకొని, యంబ తపంబు చేయగా
మెచ్చి వరంబునిచ్చె పరమేశ్వరుడామెకు మారురూపమున్
వచ్చి! శిఖండి నా బరగు వానికి - రోషము హెచ్చ నంతలో
ముచ్చటగొల్పు ముద్దియకు మూతిని మీసముమొల్చె వింతగా!

 

దత్తపది : రాముడు, భీముడు, కాముడు, సోముడు - లంకాదహనం.


పూరణ :
రాముడు తకై వగవ, రాక్షస మాయలు త్రెళ్ళజేయగా
సోముడు, భానుడున్ కనుల శోభగ నిండిన వాయుపుత్రుడే
భీముడmంగ లేచి, యతి భీకర సాగరలంఘనంబుచే
కాముడు నిండినట్టి దశకంఠుని లంకను కాల్చె నహ్హహా!

 

వర్ణన : మేఘాలలో చిక్కుకుని ప్రమాదంలో చనిపోయిన ముఖ్యమంత్రి డారా॓జశేఖరరెడ్డి విషాదము గూర్చి.

 

ఆ జననేత లేడు ! మనహాయికి సత్పథకంబు పెట్టి తా
నే జగమందెనో? జనుల హృద్వనమందున నిల్చి నాడవే!
నీ జయ గీతి పాడుచును! నెమ్మది కోవెల కట్టిరీ ప్రజల్
పూజలొనర్చుచుండిరిల పూర్ణయశస్కుడ! రాజశేఖరా!

 

నిషిద్ధాక్షరి: శ్రీగణపతి వర్ణన - కందంలో.
1వ పాదంలో బ నిషేధం, 2వ పాదంలో మ నిషేధం
3వ పాదంలో య నిషేధం, 4వ పాదంలో త నిషేధం

 

పూరణ :

పార్వతి ప్రియమగు పట్టివి
శర్వు త్రిశూలంబునోర్వ జాలినవాడా!
సర్వులు నిన్నెంతురు శుభ
పర్వములన్ విఘ్ననాథ వరముల బడయన్!

 

న్యస్తాక్షరి : ద్రౌపదీపరిదేవనం గూర్చి.
1వ పాదం 5వ అక్షరం - చి, 2వ పాదం 1వ అక్షరం - స,
3వ పాదం 7వ అక్షరం - మా, 4వ పాదం 10వ అక్షరం- క.

 

అభయము చిక్కదేలయని యార్తినిదీర్పగ వేడె కృష్ణునిన్
సభను దురాత్మకుండు నిజ సంస్కృతినెంచక యాజ్ఞసేని, నన్
ఋభవులబ్రోచుధవుడ!కృత్యమునృత్యమటంచుజూచు యీ
కు భువననాధుద్రుంచియిక గూర్పుము!పంచుము!వస్త్రసంపదన్


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!