సమస్యా పూరణ పద్యాలు

తేది: 23-06-2008.


శ్రీ లలితాపీఠం, లలితానగర్, విశాఖపట్నం

 

సమస్య: పరసతి పొందుపొందు మగవారికిఁ గల్గవెభోగభాగ్యముల్

 

నిరతము కామలోలురయి నీచములై తగనట్టి కృత్యముల్
విరివిగ నాచరింపగ వివేకవిహీనత దాపురించు - నే
పరసతి పొందుపొందు మగవారికిఁ; గల్గవె భోగభాగ్యముల్
ధరను భవాని పావన పదాంబుజ సీమను చిత్తముంచినన్!!

 

దత్తపది: హరి, అరి, విరి, సిరి - నరసింహ స్తుతి:-

హ నరసింహరూపమున నా దనుజాధిపు నుర్విగూల్చగా
నరయగ పోరునందున విహంగతురంగుడు నంకపీఠిపై
అరిని వధించి, వాని భవయానముఁ దీర్చెను; వేల్పులెల్లరున్
విరులను వృష్టిగాగ కురిపించిరి చూ రిpక్షయంబిలన్!!

 

వర్ణన: తొలకరి జల్లులు:-

మలమల మాడ్చుచుండనిల మండుచు నెండలు నేకధాటిగా!
తొలకరి జల్లులీయవొకొ? తోషపయోధి జనాళిక, ంత మే
నలరగ, నుల్లముల్లసిల హా! యని యీ యవధాన సత్సభల్
వెలవెలబోవుచుండెనని వేడుకఁదీఱరె వెండివెండియున్!!

 

నిషిద్ధాక్షారి: లలితాంబ గూర్చి:-

నీవై యుండన్ మాయెడ
శ్రీవై, యోటంబు యున్నె చిరుయన మాతా!!
దేవి లలితాంబిక నిను
భావింతుము సతము మాకు భాగ్యములిడుమా!!

 

న్యస్తాక్ష: అవధూత వర్ణన:-

1వ పాదం 6వ అక్షరం - మ
2వ పాదం 9వ అక్షరం - హా
3వ పాదం 14వ అక్షరం - స్వా
4వ పాదం 18వ అక్షరం - మి

 

ప్రార్థింతున్ నమహోయటంచు మది, భవ్యాఖ్యానముల్ చెప్పె, నే
నర్థింతున్ కనగా మహాబ్ధివినవే యాచార్య! నాకిమ్మదే
వార్థింబోలిన సద్యశమ్ము వడి, నీవై స్వామి నారక్షగా
సార్థక్యంబునుఁగూర్చు సిద్ధవర! విశ్వాసింతు నిన్ స్వామిగా!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!